మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (12:44 IST)

చావు తప్ప మరో మార్గం లేదంటున్న శంకరమ్మ

తనకు టిక్కెట్ ఇవ్వకుంటే చావు తప్ప మరోమార్గం కనిపించడం లేదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తర్వలోనే జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ తరపున ఆమె పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం టిక్కెట్ కేటాయించలేదు. 
 
దీనిపై శంకరమ్మ స్పందిస్తూ, శ్రీకాంతాచారి తల్లిగా తనకు టిక్కెట్ కేటాయించకుండా అన్యాయం చేశారనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ టిక్కెట్ తనకు కేటాయించకపోతే తనకు చావు తప్ప మరోమార్గం లేదని ఆమె హెచ్చరించారు. వెయ్యి మంది అమరుల త్యాగాల పునాదులపైమీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అమరుల కుటుంబానికి ఒక్కటంటే ఒక్క సీటు కేటాయించలేరా అని శంకరమ్మ ప్రశ్నించారు.