పెళ్లి ఊరేగింపులో డీజే వద్దన్నారని.. యువకుడు ఏం చేశాడో తెలుసా?

marriage
మోహన్| Last Updated: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (11:46 IST)
పెళ్లి ఊరేగింపులో డీజే ఏర్పాటు చేయడానికి తండ్రి నిరాకరించడం వల్ల మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణాలోని వనపర్తి జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. అమరచింత మండలం కొంకలవానిపల్లెకు చెందిన తిరుపతయ్య మొదటి భార్య కుమారుడు అశోక్ పెళ్లి ఈ నెల 24న ఆత్మకూరు మండలానికి చెందిన అమ్మాయితో నిశ్చయమైంది. 
 
అందుకోసం మంగళవారం జమ్ములమ్మ గ్రామ దేవత వేడుక చేసారు. పెళ్లి ఊరేగింపులో డీజే ఏర్పాటు చేయడం కోసం రూ.25 వేలు ఇవ్వమని తండ్రిని కోరాడు. ఇప్పటికే వివాహ ఖర్చు పెరిగిందని, డీజేకి బదులు భోజన ఏర్పాటు చేసేందుకు ఆ డబ్బును ఖర్చు చేద్దామని చెప్పాడు. ఇందుకు మనస్తాపం చెందిన అశోక్ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయాడు. 
 
గ్రామ శివార్లలోని పంట పొలాల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం ఉదయం గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.దీనిపై మరింత చదవండి :