ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రియాంక జీన్స్, టీషర్టులే.. అక్కడ మాత్రమే చీర?

priyanka gandhi
Last Updated: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (10:15 IST)
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీపై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రియాంక గాంధీ అన్నయ్య అయిన రాహుల్ పెళ్లి చేసుకోలేదు. సోదరి రాజకీయాల్లోకి వచ్చిందంటూ సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాని పదవి జన్మతః రిజర్వ్ అయిపోయిందని.. అందుకే అన్నకు పెళ్లి కాలేదని సోదరి రాజకీయాల్లో వచ్చిందన్నారు. 
 
బీజేపీలో చాయ్‌వాలా నరేంద్రమోదీ ప్రధాని అయ్యారని, బూత్ లెవల్ కార్యకర్త అయిన తాను బీజేపీకి అధ్యక్షుడిని కాగలిగానని, కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న తేడా ఇదేనని షా వివరించారు. 
 
అంతేగాకుండా బీజేపీ నేతలు ప్రియాంకా గాంధీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు హరీష్ ద్వివేదీ ప్రియాంకా గాంధీ డ్రెస్ కోడ్‌పై నోరు పారేసుకున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రియాంక జీన్స్ ప్యాంటు, టీషర్ట్ ధరిస్తారని... నియోజకవర్గానికి వెళ్లినప్పుడు మాత్రమే చీర కట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ విఫల నేత అయినప్పుడు ప్రియాంక కూడా విఫల నాయకురాలు అయినట్టేనని చెప్పారు.దీనిపై మరింత చదవండి :