బీటెక్ చేసినా ఉద్యోగం రాలేదని బ్రిడ్జి పైనుంచి దూకేశాడు...
పీజీలు పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాలు కరువైపోయాయి. ఉద్యోగ పోరాటంలో బలైపోతున్నవారు ఎంతోమంది. అప్పులు చేసి చదివి ఉద్యోగాలు రాకపోతే కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగి తిప్పలు పడి చివరికి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌కి చెందిన 30 ఏళ్ల ఒక వ్యక్తి ఢిల్లీలోని విహార్ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటనా స్థలంలో పోలీసులకు అతడి డైరీ దొరకడంతో వివరాలు తెలుసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన ఆ వ్యక్తి రెండిన్నర సంవత్సరాల క్రితం ఉద్యోగ వేట కోసం ఢిల్లీ వచ్చాడు. వచ్చిన నాటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాళ్లరిగేలా తిరగని చోటు లేదు, పడని పాటు లేదు. నిరాశ చెందిన అతడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.