జీలకర్ర, బెల్లం తంతు పూర్తయ్యింది.. తాళి కట్టొద్దని వధువు వెళ్లిపోయింది..
పెళ్లి పీటలపై నవ వధువు కూర్చుంది. అయితే పెళ్లి బలవంతం మేరకు జరుగుతుందని.. ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదని.. ఓ వధువు తాళి కట్టే సమయానికి పెళ్లిపీటల పై నుంచి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌కి చెందిన యువకుడికి ఖమ్మం చెందిన యువతితో పెళ్లి కుదిర్చారు పెద్దలు. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పెళ్లి తంతులో భాగంగా జీలకర్ర, బెల్లం తంతు కూడా పూర్తయ్యింది. చివరికి తాళికట్టేముందు నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదంటూ వధువు పక్కనే ఉన్న పెళ్లికొడుకుని నెట్టేసి మరీ వెళ్లిపోయింది. విషయం తెలుసుకుని పెళ్లిమంటపానికి చేరుకున్న డీఎస్సీ నరేష్ కుమార్ పెళ్లికూతురితో ఎంత మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరికి వధువు అంగీకరించకపోవడంతో ఈ వివాహాన్ని పెద్దలు రద్దు చేశారు.