సంబంధిత వార్తలు
- నేను భయపడినంత జరిగింది.. వెళ్లొద్దని మా నాన్నకు చెప్పాను..
- వైరల్ అవుతున్న అంకుల్ డ్యాన్స్.. ప్రియా ప్రకాష్ వారియర్‌లా?
- ఎన్టీఆర్ మళ్లీ తండ్రి అయ్యాడు.. అభయ్‌కి చెల్లెలు పుట్టిందోచ్..
- కోల్‌కతాలో దారుణం.. విద్యార్థిని బట్టలూడదీసి.. నగ్నంగా నిలబెట్టి కొట్టారు..
- పాకిస్థాన్ అందగాడు.. కర్బూజావాలా కాదు.. కాబోయే డాక్టర్..
25ఏళ్ల నిక్‌తో 35ఏళ్ల ప్రియాంక లవ్వాయణం.. జంటగా ప్రయాణం ఎక్కడికి?
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రేమలో పడింది. అమెరికా సింగర్ నిక్ జోనాస్‌తో ప్రియాంకా చోప్రా ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రేమలో పడింది. అమెరికా సింగర్ నిక్ జోనాస్‌తో ప్రియాంకా చోప్రా ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో కలిసి చక్కర్లు కొడుతోంది.
క్వాంటికో, బేవాచ్ లతో అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా చోప్రా.. ఆమెకు 35 ఏళ్లైనప్పటికీ.. 25ఏళ్ల నిక్‌తో కలసి ఇటీవలి కాలంలో పలుమార్లు కెమెరాకు చిక్కింది. తాజాగా వీరిద్దరూ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి కెమెరా కంటికి చిక్కారు. వీరిద్దరూ కలిసి ప్రయాణం చేసినట్లుండే ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి.
ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం సినిమా పనిలో భాగంగా వీరిద్దరూ కలుసుకుంటున్నారని చెప్తున్నారు. వీరిద్దరూ కలిసి ఓ సినిమా ప్రాజెక్టు చేస్తారని.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
ఇటీవల నిక్-ప్రియాంకా లాస్ ఏంజెల్స్‌లో బాస్కెట్ బాల్ మ్యాచ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తీయించుకున్న ఫోటోలను ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.
