శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (09:27 IST)

కోల్‌కతాలో దారుణం.. విద్యార్థిని బట్టలూడదీసి.. నగ్నంగా నిలబెట్టి కొట్టారు..

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పుణ్యమాని నేరాల సంఖ్య పెరిగిపోతోంది. కాలేజీ యూనియన్ తీసుకున్న నిర్ణయాల గురించి వివరాలు చెప్పాలని అడిగిన పాపానికి ఓ విద్యార్థిని బట్టలూడదీసి కొట్టి పైశాచికానందాన్ని పొందార

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పుణ్యమాని నేరాల సంఖ్య పెరిగిపోతోంది. కాలేజీ యూనియన్ తీసుకున్న నిర్ణయాల గురించి వివరాలు చెప్పాలని అడిగిన పాపానికి ఓ విద్యార్థిని బట్టలూడదీసి కొట్టి పైశాచికానందాన్ని పొందారు. అంతేగాకుండా ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. ఈ ఘటన కోల్‌కతాలో కలకలం రేపింది.
 
మే 17వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సెయింట్ పాల్ కేథడ్రాల్ కాలేజీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, సదరు విద్యార్థి, తననేమీ చేయవద్దని ప్రాధేయ పడుతున్నా.. మిగిలిన విద్యార్థులు ఆమెను బలవంతంగా బట్టలూడదీసి.. నగ్నంగా నిలబెట్టడమే కాకుండా కొట్టారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మంత్రి పార్థా చటర్జీ తెలిపారు. ఇటువంటి ప్రవర్తన సిగ్గుచేటని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.