సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (10:27 IST)

ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా-చెన్నైల ఢీ- ప్రోమో సంగతేంటి? హైదరాబాద్ ఓడిపోతుందా?

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌లో భాగంగా.. హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ ఎలిమినేటర్-2 మ్యాచ్ ఫిక్స్ అయ్యిందనే వార్తలు క్రికెట్ ఫ్యాన్స్‌లో న

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌లో భాగంగా.. హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ ఎలిమినేటర్-2 మ్యాచ్ ఫిక్స్ అయ్యిందనే వార్తలు క్రికెట్ ఫ్యాన్స్‌లో నిరాశను మిగిల్చాయి. 
 
ఈ పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమి చెంది, ఫైనల్స్‌కు కోల్ కతా నైట్ రైడర్స్ వెళుతుందా? అని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ పోటీలను లైవ్ టెలికాస్ట్ విధానంలో స్ట్రీమింగ్ చేస్తున్న హాట్ స్టార్, ఫైనల్ మ్యాచ్ గురించి చూపిస్తున్న ప్రోమోను చూస్తుంటే ఫిక్సింగ్ నిజమేనని అనిపిస్తోంది.
 
ఎందుకంటే, ఈ ఫైనల్ మ్యాచ్ కోల్ కతా, చెన్నై మధ్య జరగనుందని, ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్‌ని తప్పకుండా చూడాలన్నదే ఆ ప్రోమో సారాంశం. ఈ ప్రోమోను బట్టి హైదరాబాద్ తప్పకుండా ఓడిపోతుందనే విషయాన్ని ముందే ఎలా నిర్ణయిస్తారని క్రికెట్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఈ ప్రోమో ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని.. హైదరాబాద్ ఓడిపోవడం ఖాయమా అని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
ఇక గురువారం నుంచి ఈ ప్రోమో వైరల్ అవుతుండగా, క్రీడాభిమానులు, ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫైనల్స్‌కు కోల్‌కతా వెళుతుందని హాట్ స్టార్ ముందే ఎలా చెబుతుందని వారు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.