శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (10:37 IST)

పాకిస్థాన్ అందగాడు.. కర్బూజావాలా కాదు.. కాబోయే డాక్టర్..

పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ ఖాన్.. టీవాలా ప్రస్తుతం మోడల్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్ చేసి ఇతడు సక్సెస్ అయ్యాడు. ఇదే తరహాలో ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి మరో యువకుడు సోషల్ మీడ

పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ ఖాన్.. టీవాలా ప్రస్తుతం మోడల్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్ చేసి ఇతడు సక్సెస్ అయ్యాడు. ఇదే తరహాలో ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి మరో యువకుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. 
 
ఓ పుచ్చకాయను కోస్తున్న యువకుడి చిత్రాన్ని అతని ఫ్రెండ్ ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ ఫోటో వైరల్ అయ్యాడు. ఈ ఫొటోను షేర్ చేసిన ఓ యువతి "కర్బూజావాలా పఠాన్ వంటి యువకుడు కావాలి... ఈ జీవితానికి అంతే చాలు" అని కామెంట్ చేసింది. 
 
చాయ్ వాలా కంటే ఇతను మరింత స్మార్ట్‌గా ఉన్నాడని పాకిస్థాన్ అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. కానీ కర్బూజావాలా కాదట. కాబోయే డాక్టర్ అట. ఈ యువకుడి పేరు మహ్మద్ ఓవేజ్ అని, కరాచీలోని జియావుద్దీన్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడని, కాబోయే డాక్టరని అతని మిత్రుడు మహ్మద్ ఇన్షాల్ తెలిపాడు.