సంబంధిత వార్తలు
- ఐపీఎల్ 2020: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం
- ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు.. కోహ్లీ, డివిలియర్స్ నెం.1 జోడీగా..? (video)
- జీవా ధోనీపై అనుచిత వ్యాఖ్యలు.. షాహిద్ అఫ్రిది ఏమన్నాడంటే?
- ఐపీఎల్ 2020 : లక్ష్య ఛేదనలో చతికిలపడిన చెన్నై ... నైట్ రైడర్స్ రైట్ రైట్
- సోషల్ మీడియాకు బానిస కాని అమ్మాయి కావాలి.. (video)
పారాగ్లైడింగ్.. సెల్ఫీ స్టిక్‌పై వాలిన రాబందు.. నెట్టింట వైరలైన వీడియో
Vulture
పారాగ్లైడింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉండగా ఓ రాబందు వచ్చి వాలింది. కానీ వాళ్లు దాన్ని ఏమి అనకుండా అలాగే ఉండిపోవడంతో కొంత సేపటికి ఎగిరిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు. రాబందు అలా వాలడానికి కారణం కూడా ఉందని పలువురు పేర్కొంటున్నారు. పక్షులు గాల్లో ఎగిరే సమయంలో అలసిపోవడం వల్ల మధ్య మధ్యలో ఏదైనా చెట్టు, ఇతర వస్తువులపై వాలుతూ ఉంటాయి.
అలాగే రాబందుకు సెల్ఫీ స్టిక్ కనిపించడంతో వాలిపోయింది. తిరిగి ఎగిరేందుకు శక్తిని కూడగట్టుకోగానే దాని దారిలో అది వెళ్లిపోయింది. ఈ వీడియోను నెటిజన్లు తెగ ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Vulture hitches ride on selfie stick pic.twitter.com/fgNg03E2QY
— Freaking Awesome (@freak1ngawesome) October 16, 2020
