1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Botsa fires on Nara Lokesh

లోకేష్‌కు పరిజ్ఞానం లేదు, చంద్రబాబు దగ్గర నేర్చుకుంటే మంచిది: బొత్స

Botsa
వరద నష్టంపై నారా లోకేశ్ అంటున్న మాటల్లో వాస్తవాలు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల ఇళ్లు నీట మునిగాయని, 14 మంది ప్రాణాలు కోల్పోయారని, దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
 
భారీ ఎత్తున నష్టం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వాస్తవ పరిస్థితిని చూడాలని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనా రాయణ స్పందిస్తూ లోకేశ్ పైన మండిపడ్డారు. నారా లోకేశ్‌కు ఇంకా పరిజ్ఞానం రాలేదని బొత్స ఎద్దేవా చేశారు.
 
వర్షాలు తగ్గకుండానే నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు. ఆయనకు తెలియకపోతే ఆయన తండ్రిని అడిగి తెలుసుకోవాలని అన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు.
About Writer
వి
తర్వాతి కథనం
పారాగ్లైడింగ్.. సెల్ఫీ స్టిక్‌పై వాలిన రాబందు.. నెట్టింట వైరలైన వీడియో