సంబంధిత వార్తలు
- సీఎం జగన్‌ను కలిసిన సినీ నటుడు అలీ, ఆ పదవి ఖాయమైందా?
- నూతన విద్యా విధానంపై సీఎం జగన్ రివ్యూ, పదోతరగతి పరీక్షలో మార్పు లేదు
- పదవులన్నీ మీ కులస్తులకేనా? దమ్ముంటే బహిష్కరించి చూడండి: రఘురామరాజు
- పార్టీ నుంచి బహిష్కరించినట్టు భావిస్తున్నాను... ఆర్ఆర్ఆర్
- అపుడు వైఎస్.. ఇపుడు జగన్ :: 'యాత్ర-2'లో హీరోగా 'మన్మథుడు'
నాయీ బ్రాహ్మణులకు సంక్షేమ కటింగ్ చేశారు, జగన్ పైన నారా లోకేశ్ విమర్శ
నేడు వరల్డ్ బార్బర్స్ డే సందర్భంగా నాయీ బ్రాహ్మణులందరికీ శుభాకాక్షలు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. నాయీ బ్రాహ్మణ వృత్తి ఓ కళ అని, ఆ కళలో నైపుణ్యం పెంచడం కోసం గత టీడీపీ హయాంలో కృషి చేసామని తెలిపారు.
సెలూన్ అంటే కేవలం జీవనాధారం కోసమని కాకుండా ఒక పరిశ్రమలా ఎదగాలన్న ఆలోచనతో అవసరమైన అన్ని సదుపాయాలు చేశామని తెలిపారు. కానీ ఇప్పుడు బీసీ కార్పోరేషన్ నిర్వీర్యమై పోయిందని విమర్శించారు. రూ.5 లక్షలు ప్రమాద బీమా పత్తా లేదు.
జగన్ గారూ 5.50 లక్షల మందిలో కేవలం 38 వేల మందికే చేదోడు ఇచ్చి నాయీ బ్రాహ్మణులకే సంక్షేమ కటింగ్ చేయడం న్యాయమా అని విమర్శలు వెల్లువెత్తారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో వీరికి ప్రత్యేక సాయాన్ని ప్రకటించి ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
