అపుడు వైఎస్.. ఇపుడు జగన్ :: 'యాత్ర-2'లో హీరోగా 'మన్మథుడు'

nag - jagan
ఠాగూర్| Last Updated: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (10:17 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా మహీ వి. రాఘవ దర్శకత్వంలో గతంలో 'యాత్ర' పేరిట బయోపిక్ మూవీ వచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా, వైఎస్ జగన్ సీఎం అయ్యేంతవరకూ జరిగిన సంఘటనలతో 'యాత్ర-2' స్క్రిప్ట్‌ను ఆయన సిద్ధం చేసినట్టు సమాచారం.

ఇందులో జగన్ తెర జీవిత పాత్రను ప్రముఖ నటుడు నాగార్జున పోషించనున్నాడని సమాచారం. మహీ వి రాఘవ చెప్పిన స్క్రిప్ట్‌పై నమ్మకంతో నాగ్, ఈ పాత్రను చేసేందుకు అంగీకరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ విషయంలో అధికారిక స్పందన వెలువడాల్సి వుంది. ఈ వార్తే నిజమై, నాగార్జున, తెరపై జగన్ పాత్రను పోషిస్తే, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.

నిజానికి మహి వి రాఘవ దర్శకుడిగా ఇప్పటివరకు తీసిన చిత్రాలు 3. 'పాఠశాల', 'ఆనందోబ్రహ్మ', 'యాత్ర'. ఈ మూడు చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపునే పొందాడు. 'ఆనందో బ్రహ్మ' మంచి సక్సెస్‌ సాధించగా.. 'యాత్ర' చిత్రం అతనికి మంచి పేరును తీసుకువచ్చింది. వైఎస్‌ఆర్‌ జీవిత కథతో మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది.

ఇక ఆ చిత్రం తర్వాత మహి వి రాఘవ ఇప్పటివరకు మరో చిత్రం చేయలేదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే వరకు సాగిన జీవిత కథతో 'యాత్ర 2' స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం 'యాత్ర 2' స్క్రిప్ట్ రెడీ అయినట్లుగా, అందులో నాగార్జున.. వైఎస్ జగన్‌ పాత్రను చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :