మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా : అక్కినేని నాగార్జున

nagarjuna
ఠాగూర్|
టాలీవుడ్ మన్మథుడు, అమ్మాయిల కలల రాకుమారుడుగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున తన 61వ పుట్టిన రోజు వేడుకలను ఇటీవలే జరుపుకున్నాడు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని అనేక సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు నాగార్జున శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇలాంటి వారిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు. "తెలుగు సినిమా రంగంలో ఎక్కువ మంది అభిమానుల‌ని సంపాదించుకున్న న‌టుల‌లో మీరు ఒక‌రు. రాబోయే రోజుల‌లో మీరు మంచి ఆరోగ్యంగా ఉండాల‌ని దేవుడు మిమ్మ‌ల్ని ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను" అంటూ జగన్ ట్వీట్ చేశారు.

దీనికి నాగార్జున స్పందిస్తూ, "ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రివ‌ర్యులు జ‌గ‌న్ గారికి నా ధ‌న్య‌వాదాలు. మీ మాట‌లు నన్ను ఆనందానికి గురి చేశాయి. మీరు ఎల్ల‌ప్పుడు ఆనందం, సంతోషంగా ఉండాలి.
మీ నాయ‌క‌త్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంతో అభివృద్ది చెందుతుంది.
మిమ్మ‌ల్ని దేవుడు చ‌ల్లగా చూడాల‌ని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.దీనిపై మరింత చదవండి :