మీది ఏ ఊరు.. గుర్తింపు కార్డు లేదా? ఊర్లోకి అనుమతిలేదు : పోలీసులు

amaravati protests
ఠాగూర్| Last Updated: ఆదివారం, 23 ఆగస్టు 2020 (12:35 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం తమ పంటభూములిచ్చిన అమరాతి ప్రాంత రైతులను పోలీసులు ఏపీ పోలీసులు ఓ ఆట ఆడుకుంటున్నారు. రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 250 రోజుకు చేరాయి. ఈ క్రమంలో ఆదివారం రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు చేయనున్నారు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోను నిరసనలు హోరెత్తుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళల నిరసనలు సాగుతున్నాయి.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, పొన్నెకళ్ళు, కిష్టయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెం, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, నేలపాడు, ఐనవోలు, శాఖమూరు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు, రాజధాని ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తింపు కార్డులు ఉంటేనే గ్రామాల్లోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఎక్కడిక్కడ వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఇస్తున్నారు. గుర్తింపు కార్డు లేనివారిని లోపలకు అనుమతించడంలేదు.దీనిపై మరింత చదవండి :