గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (12:01 IST)

విశాఖపట్టణంలో ప్రారంభమైన పాలన రాజధాని నిర్మాణం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. విపక్ష పార్టీలో కాదు అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, కోర్టుల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఫలితంగా మూడు రాజధానుల నిర్మాణంలో భాగంగా, విశాఖపట్టణంలో పాలనా రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 
 
ఇందులోభాగంగా, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాపులుప్పాడ అనే ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద అతిథి గృహాన్ని నిర్మించతలపెట్టింది. ఈ ప్రాంతాన్ని భద్రతాపరంగా కూడా సురక్షితమైనదేనని అధికారులు కూడా నిర్ధారించారు.
Jaganmohan Reddy
 
దీంతో ఈ నెల 16వ తేదీన అధికారికంగా భూమి పూజా కార్యక్రమాలను కూడా అధికారులు ప్రారంభించారు. ఈ నిర్మాణాన్ని వైజాగ్ మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పర్యవేక్షించనుంది. ఈ అతిథి గృహం నిర్మాణానికి టెండర్లను కూడా అహ్వానించారు. కాగా, ఈ గెస్ట్ హౌస్‌ నిర్మాణాన్ని కేవలం 9 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.