మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వి
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:13 IST)

సీఎం జగన్‌ను కలిసిన సినీ నటుడు అలీ, ఆ పదవి ఖాయమైందా?

టాలీవుడ్ కమెడియన్ అలీ ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలీ ఓ మొక్కను సీఎం జగన్‌కు బహుకరించినట్టు తెలుస్తోంది. అలీ గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు.
 
జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఎంతో సన్నిహితుడని గుర్తింపు ఉన్న అలీ.. జనసేన పార్టీలో చేరుతాడని బాగా ప్రచారం జరిగింగి. కానీ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. అప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడనీ ఊహాగానాలు వచ్చాయి.
 
గుంటూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని ఆయన భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో టికెట్ లభించని నేపథ్యంలో అలీకి ఫిలిం డెవలెప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అలీ సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.