మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:09 IST)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుమలకు రానున్న ఇద్దరు ముఖ్యమంత్రులు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తిరుమలకు రానున్నారు. ఏపి సీఎం జగన్‌తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రానున్నారు.  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు సియం జగన్ తిరుమలలో వుంటారు.
 
23వ తేదీ సాయంత్రం తిరుమలకు చేరుకుని గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 24వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని, దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు సియంలు పాల్గోనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
అటు తరువాత కర్నాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సియంలు పాల్గొంటారు. తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు వైఎస్ జగన్.