మంగళవారం, 14 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (15:02 IST)

జీవా ధోనీపై అనుచిత వ్యాఖ్యలు.. షాహిద్ అఫ్రిది ఏమన్నాడంటే?

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుమార్తె జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. ధోనీ అతని కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వచ్చాయో తెలియదు కానీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పాడు. అతడు భారత క్రికెట్‌ను ఉన్నత స్థాయిని తీసుకెళ్లాడని గుర్తు చేశాడు. 
 
తన జర్నీలో సీనియర్స్‌, జూనియర్స్‌ ఆటగాళ్లను కలుపుకొని ముందుకు వెళ్లాడని... ధోని పట్ల ఈ విధంగా ప్రవర్తించడం గౌరవం అనిపించుకోదని షాహిద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించాడు. ప్లేయర్స్‌ సరిగ్గా ఆడకపోతే కుటుంబ సభ్యులను విమర్శించడం ఏంటని మండిపడ్డాడు. 
 
కాగా.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు పది పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయిందని సోషల్‌ మీడియాలో జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.