ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (20:10 IST)

Ziva, ధోనీ ఆరేళ్ల కుమార్తెపై అలాంటి బెదిరింపులా, మట్టిగొట్టుకుపోతారు... (video)

మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటలలో క్రికెట్ ఒకటి. జట్టు గెలిస్తే ఒక రకం, పరాజయం పాలైతే మరో రకం కామెంట్లు వస్తుంటాయి. కొందరు విషపూరితమైన వ్యాఖ్యలు చేసి సదరు ఆటగాళ్లను మానసికంగా బాధిస్తుంటారు. అసలు విషయానికి వస్తే బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తరువాత ఇలాంటి దారుణమైన కామెంట్లు చేసారు కొందరు నెటిజన్లు.
 
షేక్ జాయెద్ స్టేడియంలో కెకెఆర్ నిర్దేశించిన 168 లక్ష్యాన్ని ఛేదించడంలో సిఎస్‌కె విఫలమైన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్‌ ప్రారంభమైంది. అది ఓ హింసాత్మక ట్రోలింగ్. ఆటగాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసారు. ఇదివరకూ ఆ ట్రోలింగ్ ఆటగాళ్లు వారి భార్యలు లేదంటే స్నేహితురాళ్ళు వుండేవారు. కానీ ఇప్పుడు అది కాస్తా వెర్రితలలు వేసి వారి పిల్లలపైకి వెళ్లినట్లు కనబడుతోంది.
 
వందలాది మంది ధోనిని ట్రోల్ చేశారు. మరో దారుణమైన విషయం ఏంటంటే ధోనీ యొక్క ఐదేళ్ల కుమార్తెను బెదిరించే కొన్ని ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులు వెలికివచ్చాయి. ఇవి అత్యాచారం అంటూ వచ్చిన బెదిరింపులు. ఇలాంటివి చట్టరీత్యా నేరం. కాగా చిన్నారిపై ఇలాంటి కామెంట్లు చేసినవారు మట్టిగొట్టుకుపోతారంటూ మరికొందరు రీట్వీట్లు చేసారు.