1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
  4. Vastu Tips To Bring Wealth & Prosperity To Your Home

పాతబడిన ఇంటిని కొనుగోలు చేస్తున్నారా..?

Vastu Tips
ఇల్లు తీసుకునే ముందు వాస్తును చూసి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పండితులు సూచిస్తున్నారు. ఇలా చూసినప్పుడు ఏవైనా దోషాలు ఉన్నట్లైతే సరిచేసుకునే వీలుంటుంది. ఒకవేళ సరిచేయడానికి వీలులేని గృహాలను కొనుగోలు చేసినట్లైతే సమస్యలు మనమే కొని తెచ్చుకున్నట్లే.
 
కొందరు పాతబడిన ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటిని కూల్చివేసి వాటి స్థానంలో కొత్తగా గృహ నిర్మాణం చేపడతారు. ఇలా చేసే ముందు స్థలాన్ని కూడా వాస్తుపరంగా సరిచేసి ఆ తర్వాత మాత్రమే గృహ నిర్మాణం చేయాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
 
ఆస్తి పంపకం జరిగిన తర్వాత కొందరు ఉమ్మడి ఇళ్లను పోర్షనులుగా విభజించి పాత గోడలపైనే ఇళ్ల నిర్మాణం చేపడుతుంటారు. అయితే ఇటువంటి సమయాల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. కొత్త గృహం నిర్మాణానికి ఏ సూచనలైతే పాటిస్తారో వాటినే పాటించాలన్నది వాస్తు నియమం.
 
ఒక ఇంటిని ఒకటి కంటే ఎక్కువ పోర్షన్లుగా విభజించినప్పుడు దక్షిణ, పశ్చిమ దిశల్లో పెద్దవారు, ఉత్తర తూర్పు దిశల్లో చిన్నవారు ఉండాలన్నది వాస్తు నిబంధన. అదే విధంగా.. ఇంటిని పోర్షన్లుగా విభజించకుండా ఇంటి మొత్తాన్ని ఒక్కరే తీసుకోవటం ఉత్తమం. మిగిలినవారు ఆస్తికి సమానంగా నగదును పంచుకుంటే ఏ సమస్య ఉండదని వాస్తు చెబుతోంది.
తర్వాతి కథనం
శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేయిస్తే..?