అటుకులతో దోశెలు
|
అటుకులు ... 1 కిలో
మజ్జిగ... పావు లీటరు
బియ్యం... 1 కిలో
పచ్చిమిర్చి... 10 గ్రాములు
జీలకర్ర... 2 టీస్పూన్లు
తినే సోడా... చిటికెడు
నూనె ... పావు కిలో
ఇంగువ... సరిపడా
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
మజ్జిగని ఒక పాత్రలో పోసుకుని, అటుకుల్ని శుభ్రంగా కడిగి ఆ మజ్జిగలో నానబెట్టాలి. అలాగే బియ్యాన్ని కూడా నీటిలో నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానిన తర్వాత అటుకులు, బియ్యం మెత్తగా రుబ్బుకొని, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, తినేసోడా వేసి బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి నూనె రాసి ఈ పిండిని దోశెలు పోసుకొని ఎర్రగా కాల్చాలి. ఇవి దళసరిగా వేస్తేనే బాగుంటాయి. ఈ దోశెల్ని పల్లీల పచ్చడితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

