నట్ కోకో పలావు
కావలసిన పదార్థాలు :
కొబ్బరితురుము-2 కప్పులు
జీడిపప్పు-1/2 కప్పు
మినపప్పు-1 చెంచా
దాల్చిన చెక్క-4 చిన్న ముక్కలు
ఎండుమిర్చి-7 కాయలు
లవంగాలు-8
నెయ్యి-1/2 కప్పు
ఉప్పు-సరిపడ
బాస్మతిరైస్-2 కప్పులు
కిస్‌మిస్-1/4 కప్పు
ఆవాలు-1 చెంచా
యాలకులు-8
బిరియానిఆకులు-4
కరివేపాకు-2 రెమ్మలు
పాలు-4 కప్పులు
తయారీ విధానం :
ముందుగా బాస్మతీ రైస్‌ను శుభ్రంగా కడిగి అరగంట సేపు నీటిలో నాన పెట్టుకోవాలి. ప్రెషర్ ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేపుకుని, వాటిని ఓ ప్లేటులోకి తీసుకోవాలి. మిగిలిన నెయ్యి కూడా వేసి అందులో మినపప్పు, ఆవాలు, కరివేపాకు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి వేసి వేపాలి.
తరువాత కొబ్బరి తురుము కూడా వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు కూడా వేపాలి. తరువాత నీటిని వార్చి బియ్యాన్ని కూడా వేసి కలుపుతూ వేపుకోవాలి. ఈ లోపు పాలను కాగబెట్టి పక్కన పెట్టుకోవాలి.
కొద్ది నిమిషాలు వేపిన తర్వాత కాచిన పాలు, సరిపడ ఉప్పు వేసి ఉడికించాలి. సన్నని మంటపై మెల్లగా కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా ఉడికాక సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకుని పైన వేసిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను చల్లి వేడి వేడిగా ఉల్లిరైతాతో సర్వ్ చేసే చాలా రుచికరంగా ఉంటుంది.