1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం
  6. veg

మెట్ట వంకాయ కూర

వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చ వంకాయలు... అర కేజీ
కారంపొడి... రెండు టీ.
పసుపు... అర టీ.
ఉప్పు... తగినంత
మసాలాపొడి... నాలుగు టీ.

పోపు కోసం...
నూనె, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు... తగినంత

తయారీ విధానం :
ముందుగా వంకాయలను ముక్కలుగా తరిగి, ఉప్పునీటిలో వేసి కడిగి పక్కన ఉంచాలి. ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేయాలి. అవి వేగిన తరువాత వంకాయ ముక్కలు, పసుపు, కారంపొడి, ఉప్పువేసి మూతపెట్టాలి. నీరు పోయాల్సిన అవసరం లేదు. సన్నటి మంటమీద వంకాయ ముక్కలను ఆవిరిమీదనే మగ్గించాలి. వంకాయ ముక్కలు మెత్తబడిన తరువాత మసాలాపొడి వేసి బాగా కలిపి దించేయాలి. అంతే వేడి వేడి మెట్టవంకాయ కూర రెడీ..!!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి