వడు మ్యాంగో ఊరగాయ
కావలసిన పదార్థాలు :
మామిడి పిందెలు (వండు మామిడికాయలు)... మూడు కప్పులు
కారం... అర కప్పు
ఆవపిండి... పావు కప్పు
పసుపు... అర టీ.
ఇంగువ... అర టీ.
సిట్రిక్ యాసిడ్... అర టీ.
తయారీ విధానం :
వడు మామిడికాయల్ని కడిగి నీడలో ఆరనివ్వాలి. తరవాత కాయలకు ఉప్పు, పసుపు పట్టించి ఓ ప్లాస్టిక్ డబ్బా లేదా జాడీలో పెట్టి మూతపెట్టాలి. ఇలా వీటిని నాలుగురోజులు ఉంచాలి. కారం, సిట్రిక్ యాసిడ్, ఆవపిండి, ఇంగువ... అన్నింటినీ విడిగా కలిపి ఉంచాలి.
నాలుగురోజుల తరవాత ఈ కారం మిశ్రమాన్ని కాయలున్న జాడీలో వేసి బాగా కలిపితే వడు మ్యాంగో రెడీ...! గాలి చొరకుండా పచ్చడిని నిల్వ చేస్తే ఈ ఊరగాయ ఏడాదికి పైగానే నిల్వ ఉంటుంది.