మగాళ్లను కట్టిపడేసే మహిళల పెద్ద 'చుబుకం'
పెద్ద చుబుకం (గెడ్డం) ఉన్న మహిళలను పురుషులు అమితంగా ఆకర్షిస్తారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇలాంటి అతివలు సాధారాణ మహిళల కంటే ఎక్కువగా లైంగిక క్రియాశీలతను కలిగి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. వివరాల్లోకి వస్తే... "పర్సనాలిటీ అండ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్" అనే పత్రికలో ప్రచురించిన కథనంలో... పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ అధికంగా ఉండే మహిళలకు చుబుకం పెద్దగా తయారవుతుందని పేర్కొన్నారు. ఆ హార్మోన్ ఎక్కువగా స్రవించటం వల్ల, స్త్రీలలో లైంగికపరమైన కోర్కెలు ఉధృతంగా ఉంటాయని ఆ కథనం తెలిపింది.
పరిశోధకుల్లో ఒకరైన క్యాంప్‌బెల్ "డెయిలీ మెయిల్" పత్రికకు వెల్లడించిన కథనం ప్రకారం... శరీరంలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్ స్థాయిని బట్టి మహిళల్లో మగవారిని తలపించే ముఖ కవళికలు కూడా ఏర్పడతాయని వివరించారు. అలాంటి మహిళలకు లైంగికపరమైన వాంఛలు అధికంగా ఉంటాయని ఆయన వెల్లడించారు.
తమ పరిశోధనలకు కొంతమంది యువతులను ఎంచుకొన్నామని, వారి లైంగిక సామర్థ్యం గురించి తెలుసుకున్నామని క్యాంప్‌బెల్ తెలిపారు. అలాగే కొంతమంది యువకులను ఎంపిక చేసి వారికి పై యువతులను చూపించి, వారిలో ఎవరిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారో చెప్పమన్నామని అన్నారు. ఆ యువకులు పెద్ద చుబుకం కలిగిన మహిళలనే ఎంపిక చేసుకున్నారని క్యాంప్‌బెల్ చెప్పారు.
అలాగే.. సెలెబ్రిటీ ప్రపంచంలోకి ఓసారి తొంగిచూసినట్లయితే.... అతిపెద్ద చుబుకం కలిగిన కార్న్‌వాల్, ఆండ్రూ పార్కర్ బౌల్స్‌తో పెళ్లయిన తర్వాత కూడా, ఫ్రిన్స్ ఛార్లెస్‌తో సంబంధాలు కొనసాగించిన సంగతి తెలిసిందే... అలాగే, చిన్న చుబుకం కలిగిన హాలివుడ్ నటి జోన్నే ఉడ్‌వార్డ్, హాలివుడ్ నటుడు పాల్ న్యూమాన్‌ను పెళ్లి చేసుకుని అతడి మరణం దాకా కలిసి జీవించారు.
ఈ రెండు ఉదాహరణలూ కూడా తమ పరిశోధనలకు బలం చేకూర్చేలా ఉన్నాయని క్యాంప్‌బెల్ వ్యాఖ్యానించారు. దీనిని బట్టి పెద్ద చుబుకం కలిగిన మహిళలు ఎక్కువ లైంగిక ఆకర్షణ కలిగి ఉంటారని తాము నిర్ధారణకు వచ్చినట్లు క్యాంప్‌బెల్ పేర్కొన్నారు.