మేషం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులు, అధికారులకు అదనపు బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనంలో అవస్థలెదుర్కుంటారు.