మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంతమాత్రమే. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దుబారా ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా పడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య అవగాహనలోపం. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా కుదుటపడతాయి. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వీలైనంత వరకు సన్నిహితులతో కాలక్షేపం చేయండి. నోటీసులు అందుతాయి. న్యాయవాదుతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు స్థానచలనం. శుభకార్యానికి హాజరుకాలేరు.