Astrology Monthly Horoscope Details

Notifications

కుంభం కుంభం
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ మాసం ప్రతికూలతలు అధికం. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. నిపుణుల సలహా పాటించండి. పనులు పూర్తి కావస్తున్న సమయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం అంతంత మాత్రమే. పురోభివృద్ధి లేక నిస్తేజానికి లోనవుతారు. అపరిచితుల విషయాలకు దూరంగా ఉండండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసి వచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వద్దు. సంతానం ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. శుభకార్యంలో పాల్గొంటారు.

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జరిగినట్లుగా ఆరోపించబడుతున్న కుంభకోణానికి బాధ్యత వహిస్తారా అని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. దీనిపై ఎక్స్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. న్యాయమైన అవకాశం కోసం లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితంలోని అత్యంత విలువైన ఏళ్లను, తమ కుటుంబాల కష్టార్జితాన్ని వెచ్చిస్తారని జగన్ గుర్తు చేశారు. వ్యవస్థ వారిని నిరాశపరిచినప్పుడు, అది కేవలం ఫలితాలపైనే ప్రభావం చూపదు. నియామక ప్రక్రియపై వారికున్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసి, వారిలో తీవ్ర నిరాశను మిగుల్చుతుందని.. జగన్ తెలిపారు.

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభంతిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం నాడు సంప్రదాయబద్ధమైన ధ్వజారోహణం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు అంకురార్పణంతో ఉత్సవాల ప్రక్రియ మొదలైంది. మీన లగ్నంలో సాయంత్రం 6:21 నుండి 6:35 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య, గరుత్మంతుని చిత్రం కలిగిన పవిత్రమైన పసుపు రంగు ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. అంతకుముందు, కొండపై ఉన్న ఆలయంలో ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఉత్సవ మూర్తులు, పరివార దేవతలను బంగారు పల్లకీలో ఊరేగింపుగా బయటకు తీసుకువచ్చారు.

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు