Astrology Monthly Horoscope Details

Notifications

వృషభం వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. స్థిరాస్తి, ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త పనులు చేపడతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. ఆత్మీయులను సంప్రదించండి. వివాహాది శుభ నిర్ణయాలకు అనుకూలం. పథకాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అటుపోట్లను తట్టుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.

రూ. 3300 కోట్లకు అధిపతి, భిక్షగాడిలా అయ్యాడు, ఎందుకు?, వీడియో

ఏపీలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. శనివారం నాడు అందరితో మితంగా సంభాషించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను తప్పుపట్టే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిరువ్యాపారులకు సామాన్యం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.