కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు నిలపడతాయి. అందరితోను కలుపుగోలుగా మెలుగుతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. దైవకార్యాలకు విరివిగా వ్యయం చేస్తారు.. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. పోయాయనుకున్న వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. మానసికంగా స్థిమితపడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం, ఉద్యోగస్తులకు బాధ్యతల నుంచి విముక్తి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. వాహనం ఇతరులకివ్వవద్దు..