Astrology Monthly Horoscope Details

Notifications

సింహం సింహం
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం కాదు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం, రుణాలు చేయాల్సి వస్తుంది. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఓర్పుతో శ్రమించాలి. స్వయం కృషి ఫలితాన్నిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. మీ జీవిత భాగస్వామి ప్రోత్సాహం ఉంటుంది. తెగిపోయిన బంధువులు బలపడతారు. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగండి. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఉపాధ్యాయులకు పురస్కార యోగం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.

ఆహార భద్రతా సమస్యల పరిష్కారం కోసం స్విగ్గీ ప్రత్యేక కస్టమర్ సపోర్ట్, హెల్ప్‌లైన్‌ ప్రారంభం

ఆహార భద్రతా సమస్యల పరిష్కారం కోసం స్విగ్గీ ప్రత్యేక కస్టమర్ సపోర్ట్, హెల్ప్‌లైన్‌ ప్రారంభంభారతదేశపు అగ్రగామి ఆన్-డిమాండ్ కన్వీనియన్స్ ప్లాట్‌ఫామ్ అయిన స్విగ్గీ, మెరుగైన కస్టమర్ సపోర్ట్ కోసం రెండు ప్రత్యేకమైన ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా ఆహార భద్రత పట్ల తన నిబద్ధతను ఈరోజు పునరుద్ఘాటించింది. ఆహార భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలను తెలియజేయడానికి వినియోగదారుల కోసం స్విగ్గీ ఒక ప్రత్యేక 24x7 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. వినియోగదారులు 7948231850 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. దీనికి అదనంగా, స్విగ్గీ తన యాప్‌లోని హెల్ప్ సెక్షన్‌లో ఒక ప్రత్యేక ‘ఫుడ్ సేఫ్టీ’ ఛానెల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు వారి ఆర్డర్‌లకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి స్పష్టమైన, సులభమైన మార్గాన్ని అందిస్తుంది.

బాడీ బిల్డర్‌నని అహంకారమా? మహిళా బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్

బాడీ బిల్డర్‌నని అహంకారమా? మహిళా బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్కారణం ఏమయినప్పటికీ ఓ వ్యక్తిని హత్య చేయాలని ప్రయత్నించడం నేరం. గురుగ్రాంలో సియా అనే మహిళా బైకరును కారులో వెంబడించి ఆమెను ఢీకొట్టిన నిందితుడు కల్యాణ్ బైస్లాను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇతడిని రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసారు. ఏం జరిగింది? గురుగ్రామ్‌లో కారుతో వేగంగా వచ్చిన కల్యాణ్ కావాలని సియా అనే మహిళా బైకర్‌ను అందరూ చూస్తుండగానే అతడు తెల్లటి సెడాన్ కారులో అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టేసి వెళ్లిపోయాడు. ఇన్‌స్టాగ్రాంలో రెబల్ వీల్స్ సియాగా పిలువబడే ఆమె తనకు జరిగిన ప్రమాదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభంతిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం నాడు సంప్రదాయబద్ధమైన ధ్వజారోహణం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు అంకురార్పణంతో ఉత్సవాల ప్రక్రియ మొదలైంది. మీన లగ్నంలో సాయంత్రం 6:21 నుండి 6:35 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య, గరుత్మంతుని చిత్రం కలిగిన పవిత్రమైన పసుపు రంగు ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. అంతకుముందు, కొండపై ఉన్న ఆలయంలో ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఉత్సవ మూర్తులు, పరివార దేవతలను బంగారు పల్లకీలో ఊరేగింపుగా బయటకు తీసుకువచ్చారు.

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు