తుల
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
వ్యవహారానుకూలత, ధనలాభం ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు.