Astrology Yearly Horoscope Details

Notifications

ధనస్సు ధనస్సు
ధనుస్సు : మూల 1 2 34, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము ఆదాయం - 14 వ్యయం 11 - రాజపూజ్యం - 5 అవమానం- 6 ఈ రాశివారి గోచారం పరిశీలించగా వీరిపై అర్దాష్టమ శని ప్రభావం అంతగా ఉండదు. ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. మీదైన రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ప్రతి విషయంలోను ఆత్మస్థైర్యంతో ముందుకెళతారు. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. అవసరాలకు ఏదో విధంగా ధనం అందుతుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నోటీసులు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగివస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. తాహతుకు మించి హామీలివ్వవదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. నిత్యం సన్నిహితులు, ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. గృహ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంటాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలు ఎదురైనా వెంటనే తగ్గిపోగలవు. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. రిటైర్డు ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. అధికారులకు హోదామార్పు, కొత్త బాధ్యతలు. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. న్యాయవాదులు అన్ని కేసులను గెలుస్తారు. రాజీమార్గంలో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. వసాయ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలమే. ఆశించిన పంట దిగుబడి సాధిస్తారు. ప్రకృతిపరంగా కూడా అనుకూలం. సాధించిన పంట దిగుబడి మంచి ధర లభిస్తుంది. కూరగాయలు, పండ్లు, పూలు సాగుచేయు రైతుల ఆదాయం బాగుంటుంది. విద్యాపరంగా విద్యార్థులకు ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. మంచి ఫలితాలు, ర్యాంకు సాధించటానికివ మరింతగా శ్రమించాలి. ముఖ్యంగా ప్రేమవ్యవహారాలు, ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు దూంగా ఉండాలి. వ్యాపారులు గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. షాపుల స్థలమార్పు అనివార్యం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టార్గెట్లను కూడా విజయవంతంగా పూర్తి చేయగల్గుతారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. పరస్పరం విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు, ఆధ్యాత్మిక సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. సభలు, కీలక సమావేశాల్లో తరచుగా పాల్గొంటారు. మొత్తంమ్మీద ఈ రాశివారికి కార్యసిద్ధి, వ్యవహారజయం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యలాభం, వస్త్రప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి.

ఇటుకతో చిన్నారిపై రాక్షస దాడి చేసిన బాలుడి మానసిక స్థితి చెక్ చేస్తాం, కేసు కూడా: పంచకుల డిసిపి

రంపంతో విద్యార్థినిపై దాడి: నిశ్చేష్టురాలినై గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయానన్న టీచర్

రంపంతో విద్యార్థినిపై దాడి: నిశ్చేష్టురాలినై గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయానన్న టీచర్అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రేమోన్మాది ఓ విద్యార్థినిపై చేసిన కిరాతక చర్య గురించి తరగతి ఉపాధ్యాయురాలు వివరించారు. ఆమె మాట్లాడుతూ... పిల్లలకి పాఠం చెబుతున్నా. ఒకడు వేగంగా క్లాసు రూంలోకి ఎలక్ట్రిక్ రంపం పట్టుకుని వచ్చాడు. తరగతి గదిలో ఏదైనా పని చేయడానికి వచ్చాడేమో అనుకున్నా. కానీ అతడు నేరుగా విద్యార్థిని వద్దకు వెళ్లాడు. రంపంతో దారుణంగా దాడి చేసాడు. నేను నిశ్చేష్టురాలినై గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయా. మిగిలిన విద్యార్థులంతా క్లాస్ రూం నుంచి భయంతో పరుగులు తీసారు. చూస్తుండగానే రక్తం మడుగులో పడిపోయింది ఆ విద్యార్థిని అంటూ ఉపాధ్యాయురాలు భోరమంటూ విలపించింది.

ప్రైవేటు ఉద్యోగులు పిజ్జాలు పంచుకుంటూ డ్యాన్స్ చేయొచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదా, వీడియో

అర్నబ్ పోయింది, మురసు Murasu వస్తోంది?!! మచిలీపట్నానికి 1200 కి.మీ దూరంలో...

అర్నబ్ పోయింది, మురసు Murasu వస్తోంది?!! మచిలీపట్నానికి 1200 కి.మీ దూరంలో...ఇటీవలే గోదావరి జిల్లాలను అర్నబ్ పెనుతుఫాన్ తీవ్రంగా నష్టపరిచింది. ఇదిలావుండగానే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. ఈ వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ వాయుగుండం రానున్న 12 గంటల్లో మరింత బలపడి రేపు సాయంత్రానికి తుపానుగా మారుతుందనీ, సోమవారం సాయంత్రానికి తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుందిమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. సంతానానికి శుభయోగం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి.

01-11-2026 నుంచి 30-11-2026 నవంబర్ మాస ఫలితాలు - యత్నాలు విరమించుకోవద్దు- లక్ష్యానికి చేరువలో ఉన్నారు..

01-11-2026 నుంచి 30-11-2026 నవంబర్ మాస ఫలితాలు - యత్నాలు విరమించుకోవద్దు- లక్ష్యానికి చేరువలో ఉన్నారు..మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం అన్ని రంగాల వారికీ యోగదాయకం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. తెగిపోయిన సంబంధాలు పునఃప్రారంభమవుతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. ఇతరులపై ఆధారపడవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.