Astrology Zodiac Capricorn Chr.htm

Notifications

మకరం మకరం
గుణగణాలు

మకర రాశికి చెందిన వారు ఆశావాదులుగానూ, ఆచరణశీలిగానూ, దృఢనిశ్చయంకలవారై ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయటం వంటి గుణాలు తోడవటంతో విజయం సుగమమవుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను ఏర్పరచుకోవటంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. వీరి దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకింత ఇబ్బంది కలిగించకు మానదు. కష్టించి పనిచేయటం, క్రమశిక్షణ అనే రెండు పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్టు సరపోతాయి.

కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులు

కనకదుర్గమ్మకు రూ.75లక్షల బంగారు కిరీటం.. ఎస్వీ గో-సంరక్షణ కేంద్రానికి ఐదు గోవులువిజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఒక భక్తుడు గురువారం నాడు సుమారు రూ. 75 లక్షల విలువైన, 494 గ్రాముల బరువున్న బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. దుర్గ శ్రీనివాస్ అనే భక్తుడు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రంగురాళ్లతో పొదిగిన ఈ బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కె. సీనా నాయక్, దసరా ఉత్సవాల ప్రధాన అధికారి వి. త్రినాథ్ రావు కలిసి ఈ కానుకను స్వీకరించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజున, అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.