Author %e0%b0%b8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf 0.html

Notifications

2027 జనవరిలో మూసీ నదీతీర అభివృద్ధి పనులు ప్రారంభం

2027 జనవరిలో మూసీ నదీతీర అభివృద్ధి పనులు ప్రారంభంరాష్ట్ర ప్రభుత్వం 2027 జనవరిలో మూసీ నదీతీర అభివృద్ధి పనులను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది. మొదటి దశ కింద, హిమాయత్‌సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్ల మేర మరియు ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల మేర ప్రభుత్వం పనులను చేపట్టనుంది. మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, రేడియల్ రోడ్లు, ఇతర నగర మౌలిక సదుపాయాలతో సహా పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కింద పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?కార్తీక సోమవారం రోజు నదీస్నానం చేయడం, దీప దానం ఆచరించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ముత్తయిదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మాంగల్య భాగ్యం కలుగుతుందట. అలాగే.. శివుడిని బిల్వ దళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని విశ్వాసం. సోమవారం చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుడిని పూజించడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే కార్తీక సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైర రోజు. ఈ రోజున శివారాధన చేసినా, శివ నామస్మరణ చేసినా, శివుడికి అభిషేకం చేసినా విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.