1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Vision Board Studio Achieves ISO 9001:2015 Certification, Strengthening Its Foundation for Global Growth

ఐఎస్ఓ 9001:2015 ధ్రువీకరణ సాధించిన విజన్ బోర్డ్ స్టూడియో

Jewelry
హైదరాబాద్: ఆభరణాలు, లగ్జరీ రిటైల్ రంగంలో ప్రత్యేకత కలిగిన విజువల్ మర్చండైజింగ్, రిటైల్ డిజైన్ సంస్థ విజన్ బోర్డ్ స్టూడియో(వీబీఎస్)కు క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విభాగంలో ఐఎస్ఓ 9001:2015 ధ్రువీకరణ లభించింది. నాణ్యతా నిర్వహణకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వీబీఎస్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఈ ధ్రువీకరణ నిర్ధారిస్తుంది. సృజనాత్మక కాన్సెప్ట్‌ల రూపకల్పన, డిజైన్, ఉత్పత్తి, క్షేత్రస్థాయిలో ఏర్పాటు వరకు అన్ని ప్రక్రియలు ఈ పరిధిలోకి వస్తాయి.
 
పరిశ్రమ నుండి వరుసగా పొందిన గుర్తింపుల పరంపరలో ఈ ధృవీకరణ లభించింది. 2024 నుంచి వీబీఎస్ సంస్థ వీఎంఆర్‌డీ అవార్డ్స్, ఇండియాస్ కూలెస్ట్ స్టోర్, ఈ4ఎం రిటైల్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌లలో మొత్తం ఎనిమిది అవార్డులు గెలుచుకుంది. వీటిలో 2024, 2025 సంవత్సరాల్లో వీఎంఆర్‌డీ అవార్డ్స్‌లో బెస్ట్ విండో డిస్‌ప్లే అవార్డులు కూడా ఉన్నాయి.
 
2011లో అదితి కొటక్ స్థాపించిన వీబీఎస్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండగా, దుబాయ్‌లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్రాండ్‌ల గుర్తింపును ఆకట్టుకునే, వినియోగదారులను ఆకర్షించే రిటైల్ అనుభవాలుగా ఈ స్టూడియో తీర్చిదిద్దుతోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే స్టోర్ ముఖభాగాలు, అద్భుతమైన విండో డిస్‌ప్లేలు, భారీ ప్రచార కార్యక్రమాల ఏర్పాట్ల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన డిస్‌ప్లే యూనిట్లు, నిశితంగా తయారుచేసిన ప్రాప్స్ వరకు వివిధ సేవలు అందిస్తోంది. సృజనాత్మక ఆలోచనలు, వినూత్న డిజైన్, ఉత్పత్తి నైపుణ్యం, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన అమలు చేయడం సహా అన్ని విభాగాలను ఒకే చోట అందిస్తోంది. తద్వారా ప్రత్యేకమైన రిటైల్ వాతావరణాలను సృష్టించి, బ్రాండ్ కథనాలను మరింత ఉన్నతంగా ఆవిష్కరిస్తూ చెరగని ముద్ర వేస్తోంది.
 
‘‘నా వరకూ, డిజైన్ అంటే ఇతరులు సాధారణ ప్రదేశాలుగా చూసే చోట కూడా అవకాశాలను చూడటమే. ఒక ఆలోచనను తీసుకుని, సృజనాత్మక పరిమితులను అధిగమించి, అది ఒక అసాధారణమైన రిటైల్ అనుభవంగా రూపుదిద్దుకోవడాన్ని చూడటంలో ఎంతో సంతృప్తి ఉంటుంది’’ అని విజన్ బోర్డ్ స్టూడియో వ్యవస్థాపకురాలు అదితి కొటక్ తెలిపారు.
 
‘‘ప్రతి ప్రాజెక్టు కొత్తగా ఆలోచించడానికి, వినూత్నతను ప్రదర్శించడానికి, ప్రత్యేకమైనదాన్ని సృష్టించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. విజన్ బోర్డ్ స్టూడియో ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆసక్తే మా ప్రయాణానికి చోదకశక్తిగా నిలిచింది. సంస్థ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఐఎస్ఓ 9001:2015 ధ్రువీకరణ లభించడం మా ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయి. సృజనాత్మక లక్ష్యాలకు అత్యుత్తమ పనితనం, ప్రతి అంశంపై నిశితమైన శ్రద్ధ, స్థిరమైన అమలును జోడించాలన్న మా నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది. అంతిమంగా ఒక బ్రాండ్ గుర్తింపును ప్రతిబింబించడమే కాకుండా, వినియోగదారులపై చెరగని ముద్ర వేసే అనుభవాలను అందించడమే మా లక్ష్యం’’ అని అదితి పేర్కొన్నారు.
 
గుర్తింపు పొందిన విజయాల పరంపర
ప్రముఖ పరిశ్రమ వేదికలపై వీబీఎస్ సృజనాత్మక పనితీరుకు లభించిన గుర్తింపులు:
వీఎంఆర్‌డీ అవార్డ్స్ (2024, 2025, 2026): 2024, 2025లో బెస్ట్ విండో డిస్‌ప్లే; 2026లో విండో డిస్‌ప్లే: ఫెస్టివ్, సేల్ మరియు ఈవెంట్స్.
ఇండియాస్ కూలెస్ట్ స్టోర్ (2024, 2025): కూలెస్ట్ విజువల్ మర్చండైజింగ్.
ఈ4ఎం రిటైల్ ఎక్సలెన్స్ అవార్డ్స్:  విండో డిస్‌ప్లే డిజైన్ విభాగంలో రెండు అవార్డులు(2025) ;  సీజనల్, ఫెస్టివ్ లేదా టెంపరరీ డిస్‌ప్లే విభాగంలో అవార్డు (2026).
ఎంఎస్‌ఎంఈ హానర్ (2023): విజన్ బోర్డ్ స్టూడియో వ్యవస్థాపకురాలు అదితి కొటక్‌కు వండర్ ఉమెన్ అవార్డు.
జ్యువెలర్స్ గిల్డ్ అవార్డ్స్ (2023): విజువల్ మర్చండైజింగ్‌లో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపు.
వీఎంఆర్‌డీ అవార్డ్స్ (2022): బెస్ట్ విండో డిస్‌ప్లేకు నామినేషన్.
ముఖ్యంగా, 2024, 2025 సంవత్సరాల్లో వరుసగా వీఎంఆర్‌డీ అవార్డ్స్‌లో బెస్ట్ విండో డిస్‌ప్లే అవార్డులను వీబీఎస్ గెలుచుకుంది. 2026లో ఫెస్టివ్, సేల్ అండ్ ఈవెంట్స్ విండో డిస్‌ప్లే విభాగంలో మరోసారి గుర్తింపు పొందింది. 2025లో ఈ4ఎం రిటైల్ ఎక్సలెన్స్ అవార్డ్స్‌లో విండో డిస్‌ప్లే డిజైన్ విభాగంలో రెండు అవార్డులు అందుకోగా, 2026లో సీజనల్, ఫెస్టివ్ లేదా టెంపరరీ డిస్‌ప్లే విభాగంలో అవార్డు పొందింది. ఈ గుర్తింపులు సృజనాత్మక విజువల్ మర్చండైజింగ్ స్టూడియోగా ప్రారంభమైన వీబీఎస్,  ఆభరణాల రిటైల్ బ్రాండ్‌లకు సేవలందించే భాగస్వామ్య సంస్థగా ఎదుగుతున్న తీరును ప్రతిబింబిస్తున్నాయి. వివిధ ప్రాజెక్టులతో తన సేవల పరిధిని ఇది విస్తరిస్తోంది. ప్రముఖ పరిశ్రమ వేదికలపై వరుసగా లభిస్తున్న గుర్తింపులు డిజైన్‌లో అత్యుత్తమ ప్రమాణాలు, వినూత్నత, సమర్థవంతమైన అమలుపై సంస్థకున్న నిబద్ధతను, సృజనాత్మక ఆలోచనలను ప్రభావవంతమైన రిటైల్ అనుభవాలుగా మలుస్తున్న బృందం పనితీరును చాటుతున్నాయి.
 
‘‘విజువల్ మర్చండైజింగ్ అంటే కేవలం అందమైన డిస్‌ప్లేలను రూపొందించడం మాత్రమే కాదు. ఒక బ్రాండ్ గుర్తింపును వినియోగదారులతో అనుసంధానమయ్యే అర్థవంతమైన రిటైల్ అనుభవాలుగా మలచడం. ఈ అవార్డులు మరింత సృజనాత్మకంగా ఆలోచించడానికి, డిజైన్, అమలులో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి మాకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి’’ అని అదితి కొటక్ తెలిపారు.
తర్వాతి కథనం
బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్- రూ.51లకే ఉచిత సిమ్, 2GB హైస్పీడ్ డేటా