1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. BSNL Rs 51 Offer Gives New Users 2GB Daily Data and Calls

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్- రూ.51లకే ఉచిత సిమ్, 2GB హైస్పీడ్ డేటా

bsnl logo
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ అందిస్తోంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు కేవలం రూ.51కే ఉచిత సిమ్ కార్డుతో పాటు 28 రోజుల పాటు డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను కల్పిస్తోంది. ఈ పరిమిత కాల ఆఫర్ నవంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.51 ప్లాన్‌ ద్వారా రోజుకు 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. 
 
28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 56జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. ఈ ప్లాన్‌లో రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా అందిస్తారు. కొత్త కనెక్షన్ తీసుకునే వారికి సిమ్ కార్డు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్ ప్రధానంగా కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉపయోగిస్తున్న పాత కస్టమర్లు తమ ప్రస్తుత నెంబర్‌పై ఈ ఆఫర్‌ను రీఛార్జ్ చేసుకోలేరు.
 
ఈ ఆఫర్‌లో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది. ఆ పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. మరుసటి రోజు కొత్త డేటా కోటా అందుబాటులోకి వస్తుంది. అయితే వినియోగదారులు తమ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో లేదో ముందుగానే తెలుసుకోవాలి. కొత్త కనెక్షన్ కావాలనుకునేవారు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్‌ను సంప్రదించాలి. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
సోనియా గాంధీ బయోగ్రఫీ పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదు: కేటీఆర్