1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. BSNL Rs 225 prepaid plan offers 2.5GB daily data, unlimited calls and 30-day validity

BSNL: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. 2.5 జీబీ హై-స్పీడ్ డేటా

BSNL
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా నెలకు సుమారు 75 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. రోజువారీ పరిమితి ప్రకారం చూస్తే ప్రతిరోజూ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని 30 రోజుల వ్యాలిడిటీ. 
 
ప్రైవేట్ టెలికాం సంస్థలు చాలావరకు 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుండగా, బీఎస్ఎన్ఎల్ పూర్తి నెలకు సరిపడా సమయాన్ని ఇస్తోంది. ఒకవేళ రోజువారీ డేటా కోటా పూర్తయితే, ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది కానీ కనెక్షన్ మాత్రం కొనసాగుతుంది. 
 
డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ మాట్లాడుకునే సౌకర్యం, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: నారా లోకేష్