1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. 200 Indians return home from Pakistan via Attari-Wagah border

కరోనా సెకండ్ వేవ్ ఫియర్.. పాకిస్థాన్ నుంచి భారత్‌కు ప్రజలు

Indians
ప్రపంచ దేశాల ప్రజలకు మళ్లీ కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లోని ప్రజలు కోవిడ్‌కు జడుసుకుని అప్రమత్తంగా వున్నారు. ఇంకా విదేశాల్లో వుండే జనాలు ప్రస్తుతం స్వదేశం బాటపడుతున్నారు. ఇందుకు కారణం కరోనా సెకండ్ వేవ్ వస్తుందనే కారణంతోనే. ఇంకా కోవిడ్-19 మరోసారి విజృంభిస్తుండడంతో పాకిస్థాన్‌లో ఉండిపోయిన భారతీయులు తిరిగి వస్తున్నారు. 
 
ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒకటైన అట్టారి-వాఘా సరిహద్దు గుండా ఇండియాలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వచ్చారని, సోమవారం మొత్తంగా 200 మందికి పైగా వస్తారని అధికారులు తెలిపారు. 
 
లాక్‌డౌన్ భయాలు కొందరివి కాగా, పాకిస్తాన్‌లో కోవిడ్ వ్యాపిస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన కొందరిలో వుందని భద్రతా అధికారులు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో సొంతింటి వద్దే ఉండే కాస్తైన జాగ్రత్తగా ఉంటామని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే స్వదేశాలకు చేరుకుంటున్నారు.
తర్వాతి కథనం
జనసేనాని ఢిల్లీ పయనం, ఎందుకో తెలుసా..?