శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (19:34 IST)

వర్క్ ఫ్రమ్ హోమ్, పొట్ట దగ్గర కొవ్వు పెరిగిందా? ఈ టీ తాగితే మాయం (Video)

కరోనావైరస్ కారణంగా ఇపుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. దీనితో కాస్తంత ఒత్తిడితో పాటు సీటింగ్ పొజిషన్లు సరిగా లేకపోవడం అలా వుంచితే గంటలకొద్దీ కుర్చీలకు అతుక్కుపోతున్నారు. ఫలితంగా పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని నిరోధించాలంటే పసుపు టీ తాగాలి.
 
ఒక పాత్రలో కొద్దిగా నీళ్లను పోసుకుని అందులో చిటికెడు పసుపు వేసి ఆ నీటిని బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత పుదీనా ఆకులు, దాల్చిన చెక్క పొడి, తేనె, అల్లం రసం వీటిల్లో ఏదైనా ఒక పదార్థాన్ని ఆ నీటిలో వేసుకుని మరికాసేపు మరిగించుకోవాలి.  
 
పసుపు టీ తీసుకోవడం వలన పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. పసుపు టీ తాగడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం వ్యాధి గల వారు పసుపు టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.