బుధవారం, 13 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 12 ఆగస్టు 2025 (17:53 IST)

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

Balineni Srinivasa Reddy, Samudra, Sivika and others
Balineni Srinivasa Reddy, Samudra, Sivika and others
సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్‌ మట్టా, రోహిల్‌, ఆదిల్‌, రూపేష్‌, కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’. గోరి బ్రదర్స్‌ మీడియా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీ మార్క్‌ పతాకాలపై సిరాజ్‌ ఖాదరన్‌ గోరి నిర్మిస్తున్నరు. సురేష్‌ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్‌ ప్రభు, సాయి విజయేందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి టీమ్‌ అందరికీ షీల్డ్‌లు అందజేశారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘అన్నపూర్ణమ్మ అయిన డొక్కా సీతమ్మ గారి గురించి ఇంతకు ముందు ఎవరికీ పెద్దగా తెలీదు. పవన్‌ కల్యాన్‌ వల్ల ఆమె పేరు ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏ సమయంలో అయిన ఆమె వండి వార్చి వడ్డించేదని చెబుతుంటారు. అలాంటి వ్యకి కథతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆంధ్రాలో మధ్యాహ్నం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం. పవన్‌కల్యాణ్‌గారి స్ఫూర్తితో నేను కూడా ఒంగోలులో డొక్కా సీతమగారి పేరున అన్నదానం మొదలుపెడతారు. ఈ సినిమా విషయానికొస్తే.. ఇలాంటి మంచి వ్యక్తి కథలు జనాలకు తెలియాలి. పవన్‌కల్యాణ్‌ స్ఫూర్తితో చక్కని సందేశంతో తీసిన ఈ సినిమా విజయవంతం కావాలి. ఇలాంటి ఆదర్శవంతమైన చిత్రాలు నేటి సమాజానికి అవసరం’’ అని అన్నారు.
 
డొక్కా సీతమ్మ పాత్రధారి శివిక మాట్లాడుతూ ‘నా తొలి చిత్రమది. నటిగా లాంచ్‌ అవ్వడానికి ఇంతకన్నా మంచి టీమ్‌ దొరకదు. అద్భుతమైన పాత్ర ఇచ్చారు. న్యాయం చేశాననే అనుకుంటున్నా’’ అన్నారు.  
వి. సముద్ర మాట్లాడుతూ ‘‘డొక్కా సీతమ్మగారి జీవిత కథ ఈ సినిమా. ఇలాంటి సినిమాలు తీయడం కొందరు నిర్మాతలకే దక్కుతుంది. ఈ నిర్మాతలకు జీవిత కాలం చెప్పుకునే సినిమా అవుతుంది. ఇందులొ సీతమ్మగారి భర్తగా నటించడం అదృష్టం. నేను ఎంతోమంది స్టార్‌లను డైరెక్ట్‌ చేశాను. కానీ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు సురేశ్‌ బాగా తీశాడు’’ అని అన్నారు.
 
దర్శకుడు సురేశ్‌ లంకలపల్లి మాట్లాడుతూ ‘‘మంచి టీమ్‌ కుదిరింది. నా టీమ్‌ బాగా చేసిందని చేను చెప్పను. తెరపై వాళ్ల పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులే చెబుతారు. మంచి సినిమా తీశానని, ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా చెప్పగలను" అని అన్నారు.
 
నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సినిమా పూర్తయింది. గుమ్మడికాయ కొట్టేశాం. త్వరలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.