సంబంధిత వార్తలు
- ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ
- తండ్రి మరణించాడని తెలిసి కన్నెత్తి చూడని తాగుబోతు.. అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు
- గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు
- చేవెళ్ల రోడ్డు ప్రమాదం: 24మంది మృతి- తీవ్రగాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం (video)
- ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?
పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి
తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్‌పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా అప్పట్లో రాజకీయ నాయకులు, తితిదే ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీశ్ కుమార్ రాజీ చేసుకున్నారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఈ కేసుపై సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో.. కేసు రాజీ చేసుకున్న సతీశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. సతీశ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడేశారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
