గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:03 IST)

గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారం... హత్య...

victim
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పహడీషరీఫ్‌ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుక్కుగూడ - శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్ నుంచి అనుమానాస్పదంగా కనిపించింది. దీనిపై స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. సంచిని విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించి షాక్‌కు గురయ్యారు. 
 
ఆ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి, ఆపై నిప్పంటించినట్టు ఘటనాస్థలిలో పరిస్థితులను బట్టి అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.