శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (16:33 IST)

విజయవాడ సిద్ధార్థ కాలేజీ యువతి యువతి ఆత్మహత్య

suicide
విజయవాడలోని కృష్ణలంక రణదివే నగరులో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం రేపుతుంది. మృతురాలు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేసుంది. ఆమె పేరు ప్రత్యూష. వయసు 22 యేళ్లు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రదిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారు. 
 
మృతదేహాం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు. కన్నకుమార్తె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడాన్ని ప్రత్యూష తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఏమాత్రం తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.