సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (14:06 IST)

బ్యాంకు ఖాతాదారులకు షాకిచ్చిన కీలక బ్యాంకు

Cash
బ్యాంకు కస్టమర్లకు మరో బ్యాంక్ షాకిచ్చింది. డిపాజిట్ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. భారత రిజర్వు బ్యాంకు రెపో రేటును పెంచుకుంటూ రావడంతో పలు బ్యాంకులు కూడా నికర డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుకుంటూ వచ్చాయి. మరికొన్ని బ్యాంకులు ఎఫ్.డి.రేట్లను కూడా పెంచాయి. అయితే, ఇక్కడ మాత్రం రివర్స్ అయింది. ఎఫ్.డిలపై ఇచ్చే వడ్డీ రేటును తగ్గించింది. దీంతో బ్యాంకు కష్టమర్లు షాక్‌కు గురయ్యారు. బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావించే వారిపై వ్యతిరేక ప్రభావం చూపనుంది. 
 
ఈ బ్యాంకు పేరు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు. ఈ బ్యాంకు తాజాగా ఎఫ్.డి రేట్లపై కోత విధించింది. 1938లో ప్రారంభమైన 85 యేళ్ళ నాటి ఈ బ్యాంకు తాజాగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రేట్ల తగ్గింపు తర్వాత చూస్తే ఇపుడు వడ్డీ రేట్లపై 7.1 శాతం వరకు రాబడి లభిస్తుంది. ఏప్రిల్ 11 నుంచి రేట్ల తగ్గింపు నిర్ణయం అమల్లోకి వచ్చిందని బ్యాంకు వెల్లడించింది. ఈ బ్యాంకులో డిపాజిట్లు చేసిన వాటిలో రూ.2 కోట్ల లోపు డిపాజిట్ చేసిన వారికి ఈ వడ్డీ రేట్ల తగ్గింపు వర్తించనుంది.