గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (18:34 IST)

విడుదల పార్ట్ -1 క్లైమాక్స్ కి కనెక్ట్ అయి చప్పట్లు కొట్టేను : అల్లు అరవింద్

Allu Aravind,  Elred Kumar, Vetrimaran,  Suri, Bhavani Sri
Allu Aravind, Elred Kumar, Vetrimaran, Suri, Bhavani Sri
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ యొక్క "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్"  ద్వారా  తమిళ చిత్రం "విడుతలై పార్ట్ 1" తెలుగు వెర్షన్‌ "విడుదల పార్ట్ 1" గా ఏప్రిల్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ మీడియా ప్రతినిధులకు ఈ చిత్రాన్ని ప్రదర్శించి. విడుదల చిత్ర బృందంతో ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ , నిర్మాత ఎల్రెడ్ కుమార్‌, దర్శకుడు వెట్రిమారన్ ,హీరో సూరి , భవాని శ్రీ పాల్గొన్నారు. 
 
నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ మాట్లాడుతూ...  ఈ సినిమా కంప్లీట్ గా కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.  ఈ సినిమాని తమిళ్ లో అరవింద్ గారు చూసి అప్రిషియేట్ చేశారు. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కుమరేశన్ పాత్ర కోసం  సూరి ఈ సినిమాలో చాలా బాగా కష్టపడ్డాడు.  అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది.  పాప క్యారెక్టర్ లో భవాని అద్భుతంగా ఒదిగిపోయింది. మాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ అన్నారు. 
 
భవాని శ్రీ మాట్లాడుతూ...  విడుదల పార్ట్ 1 తెలుగులో రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.  థాంక్యూ అల్లు అరవింద్ గారు. వెట్రిమారన్ గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు. సూరి, విజయసేతుపతి లాంటి వారితో వర్క్ చేయటం మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాలు ఆదరిస్తారు. ఈ సినిమాని తెలుగులో కూడా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారని  కోరుకుంటున్నాను. 
 
హీరో సూరి మాట్లాడుతూ....  "విడుదల" సినిమా తెలుగులో ఏప్రిల్ 15న విడుదల అవుతుంది. అందరూ దయచేసి థియేటర్ లో ఈ సినిమాను  చూడండి. ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నందుకు అల్లు అరవింద్ గారికి థాంక్యూ సార్. చెన్నయ్ సూరి, కుమరేశన్ హైదరాబాద్ వరకు వచ్చేసాడు. నాకు అవకాశం ఇచ్చినందుకు వెట్రిమారన్ సర్ కి, ఎల్రెడ్ కుమార్‌ సర్ కి థాంక్యూ. 
 
దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ... నేను తీసే సినిమాలు ఎప్పుడు రూటెడ్ గానే  ఉంటాయి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోలేదు.  ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ.  ఆయన ఈ సినిమాను థియేటర్లోనే చూస్తాను అని చెప్పి థియేటర్లో చూసి. రాత్రి రెండు గంటలకి ఫోన్ మాట్లాడి పొద్దున్నే నన్ను కలిశారు . నన్ను కలిసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్లు ఏంటి అని చెప్తా అన్నారు. 
ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాను ముందుగా నాలుగు కోట్ల బడ్జెట్ తో 30 నుంచి 35 రోజుల్లో ఒక చిన్న సినిమాగా ఫినిష్  చేద్దాం అని అనుకున్నాం.  కానీ ఈ సినిమా మూడు రెట్లు ఎక్కువ ఖర్చుతో వంద రోజులు పైగా షూటింగ్ జరుపుకుంది. . 
నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు.  ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా అవసరం. ఇళయరాజా గారు మంచి ట్యూన్స్ అందించారు.  ఈ సినిమాను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 
 
నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ...  లోకల్ ఈజ్ గ్లోబల్  అంటారు . ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేసాను. వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఆయనే సినిమాలే కాకుండా ఆయన ఇన్వాల్ అయ్యే సినిమాలు కూడా చూస్తాను. ఈ విడుదల సినిమాను రెండు పార్టులుగా చేసారు. ఈ పార్ట్ 2 లో చివరిదాకా ఉంటారు. ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి సినిమాను మీడియా ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. మన రూట్స్ నుంచి సినిమా తీస్తే అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ను ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో కూడా అలాంటి వరల్డ్ ను క్రియేట్ చేసి ఆసక్తిని పెంచాడు వెట్రిమారన్.