ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (09:45 IST)

కోడి గుడ్డు... బాతు గుడ్డు తెలుసు.. వైయస్‌ఆర్‌ఎస్పీ గుడ్డేంటబ్బా...

jagan photo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ ప్రచార పిచ్చి తారా స్థాయికి చేరుకుంది. తమ ప్రచారం కోసం ఇప్పటివరకు చెట్టూపుట్టా ఇలా ఏ ఒక్కదాన్నీ వదిలిపెట్టలేదు. ఇపుడు కోడిగుడ్లను సైతం తమ ప్రచారానికి విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వైకాపా ప్రచారం పరాకాష్టకు చేరుకుంది.
 
ఏదో రూపంలో వైఎస్‌ఆర్ పేరు, సీఎం జగన్ చిత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం అందజేసే ప్రతి ఒక్క వస్తువుపై వాటిని ముద్రిస్తున్నారు. బాలింతలు, గర్భిణులకు అందించే గుడ్లు, వివిధ రకాల సరకులపైనా వైయస్‌ఆర్‌ ఎస్‌పీ (సంపూర్ణ పోషణ) అని ముద్రించి మధ్యలో జగన్‌ బొమ్మను వేస్తున్నారు.
ysr eggs
 
తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఆ సరకులు చూసిన మహిళలు ఆశ్చర్యపోయారు. గుడ్లపై వైయస్‌ఆర్‌ఎస్పీ అనే ముద్రను చూసి ముక్కున వేలేసుకున్నారు. 'కోడి గుడ్డు తెలుసు.. బాతు గుడ్డు తెలుసు.. వైయస్‌ఆర్‌ఎస్పీ గుడ్డేంటబ్బా' అని సామాజిక మాధ్యమాల్లో ఛలోక్తులు వేసుకుంటున్నారు.