1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Karnataka python news

కొండ చిలువ మేకను మింగేసింది.. మింగిన చోటనే కదల్లేక..!

కొండ చిలువ పిల్లినో కుందేలునో.. కప్పనో మింగేసిందని వినివుంటాం. అయితే కర్ణాటకలోని శూలగిరి సమీపంలోని గ్రామం వద్ద 13 అడుగుల కొండ చిలువ మేకను మింగేసింది. అంతేగాకుండా మింగింది.. మేక కావడంతో గత రెండు రోజులు

Karnataka python news
కొండ చిలువ పిల్లినో కుందేలునో.. కప్పనో మింగేసిందని వినివుంటాం. అయితే కర్ణాటకలోని శూలగిరి సమీపంలోని గ్రామం వద్ద 13 అడుగుల కొండ చిలువ మేకను మింగేసింది. అంతేగాకుండా మింగింది.. మేక కావడంతో గత రెండు రోజులుగా ఉన్న చోటనే ఉండటంతో వరదాపురం పిండెగానపల్లి స్థానికులు ఎగబడి చూస్తున్నారు. ఇంకా వరదాపురం సమీపంలోని పొలంలో కొండ చిలువ మేకను మింగింది. 
 
రెండు రోజులు తరువాత మేకను వెదుకుతూ వెళగా సోమవారం రాత్రి కంటబడింది. కొండ చిలువ కదలక ఉండడం వల్ల మేకను కొండచిలువే మింగియుంటుందని నిర్దారణకు వచ్చారు. ఈ విషయం ఆ ప్రాంతమంతా తెలియడంతో కొండ చిలువను చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు. మింగడం పెద్దజీవిని కావడంతో ఆ చోటు నుంచి కొండ చిలువచే కదల్లేకపోతుందని స్థానికులు అంటున్నారు. 
About Writer
Selvi
తర్వాతి కథనం
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసివున్న ఫోటోను అప్‌లోడ్ చేసిందనీ... కుమార్తెను చితక్కొట్టిన తల్లి...