సంబంధిత వార్తలు
- ఒకే రోజులో 400 మందికి పైగా ట్రైనీ ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్
- రూ.500 బాండ్ పేపర్‌పై ఒప్పందం చేసిన ప్రేమికులు.. అందులో ఏముందంటే?
- Jayalalithaa-జయలలిత ఆస్తుల స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభం..
- BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)
- పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)
ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం.. మే నెలలో పరిస్థితి ఎలా వుంటుందో?
వేసవి కాలం మొదలైంది. ఫిబ్రవరిలో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రామగుండలో, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3డిగ్రీల పెరిగాయి. గాలిలో తేమ శాతం బాగా తక్కువగా ఉంటోంది. ఫిబ్రవరిలోనే ఇలా ఎండలు మండిపోతుంటే.. మే నెల వచ్చేనాటికి పరిస్థితి మరింత దారుణంగా వుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఏడాది జనవరిలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. శనివారం గరిష్టంగా మహబూబ్ నగర్‌లో 36.7, కనిష్టంగా నల్లగొండలో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం, శనివారం ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. శుక్రవారం ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదువుతున్నాయి.
